సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జూనియర్ కాలేజ్ లో జరిగిన మెగా జాబ్ మేళాకి విచ్చేసిన రాష్ట్ర మెడికల్ హెల్త్ డైరెక్టర్ జి ఎస్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.గడల శ్రీనివాసరావు కి ఘనంగా స్వాగతం పలికిన కొత్తగూడెం పట్టణ యువ నాయకులు అర్షద్ మరియు కిరణ్. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు రిబ్బన్ కటింగ్ చేసి, అన్ని కంపెనీల HR ప్రతినిధులకు అభినందనలు, ఉద్యోగం కోసం వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 8000 పైగా రిజిస్ట్రేషన్లు జరిగినవి అని, దానిలో దాదావు 7000 మంది అభ్యర్థులు పాల్గొన్నారని డా. గడల శ్రీనివాసరావు ప్రకటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ... నిరుద్యోగ నిర్మూలనకై డా.జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళా విజయవంతం చేయడానికి, నిరుద్యోగాన్ని అరికట్టడానికి నేను వేసిన ఈ ఒక్క అడుగుకి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిపుతుందని డా గడల శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎంత ముఖ్యం, వాటిని సాధించుకోవడానికి ఆర్థికంగా ముందుకు సాగడానికి ప్రోత్సహిస్తేనే ఉపాధి తో పాటే ఇవన్నీ సాధ్యపడతాయి, నా వంతు కృషిగా నిరుద్యోగుల జీవితాల్లో సంతోషాన్ని నింపాలని సంకల్పంతో మరియు నేను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే అవకాశం దిశగా ఇది నా ప్రయత్నం అన్నారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థుల కష్టాలు తనకు తెలుసని కష్టపడ్డ వారికి తగిన ఫలితం దక్కుతుందని ప్రతి ఒక్కరూ వారి వంతుగా ఈ ఉద్యోగ అవకాశాల్లో ప్రయత్నం చేసి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు పొందిన యువతీ యువకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉపాధి, సహాయ సేవా కార్యక్రమాలు గాని కార్యక్రమాలు గాని చేసుకోవడానికి కొత్తగూడెం పట్టణ ప్రాంత ప్రజలందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు...
-----------------------
Admin