Monday, 27 July 2026 02:32:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీది రైతుల పై కక్ష సాధింపు శైలి... - కిష్టిపాటి అంజిరెడ్డి

Date : 13 July 2023 07:55 AM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకీడు : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపు మేరకు హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు పాలకవీడు మండల కేంద్రంలొ బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కిష్ఠపాటి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ విద్యుత్తు రద్దు చేయాలనీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విచక్షణ లేనివనీ,తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్ కక్ష కట్టిందని మండిపడ్డారు.70 ఏళ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని విమర్శించారు.దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రైతులు ఎదగాలని 24 గంటల ఉచిత కరెంటు అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి ఉండేదని.ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని వెల్లడించారు.కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రైతులకు భరోసగా రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ,మిషన్ భగీరథ ఇంకా మరెన్నో సంక్షేమ పథకాలను అందిస్తూ భారత దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం అని ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.మొదటినుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపే అని, మొన్న ధరణి వద్దన్నారు ఇప్పుడు వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని రైతులపై కక్ష సాధింపు చర్య అని అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్,ఒక చీటర్ ఐదు నిమిషాలలో భూమి రిజిస్ట్రేషన్ అవుతున్న ధరణి పోర్టర్ కూడా వద్దంటున్నారు.రైతులతో పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వమే గద్దె దిగే పరిస్థితి వచ్చిందనీ , తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం, తెలంగాణ రైతులంతా కాంగ్రెస్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడగొట్టి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని కోరారు.ఈకార్యక్రమంలో మండలనాయకులు ఆయా గ్రామాల సర్పంచ్లు ,ఎంపీటీసీ లు గ్రామ అధ్యక్షులు,వివిధ అనుబంధకమిటీఅధ్యక్షులు,రైతుసంఘాలనాయకులు, రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :