సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఈనెల 12వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిన సంవత్సరం గోదావరి వరదల సందర్భంగా పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం వచ్చి వరద ముంపు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని అందుకోసం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నానని హామీ ఇచ్చారు. కానీఇప్పటికి 6 నెలల దాటుతున్న మళ్లీ వర్షాకాలం సీజన్ సమీపిస్తున్న ఇంతవరకు వారు ఇచ్చిన హామీ గాని శాశ్వత పరిష్కారంకోసం 1000 కోట్ల రూపాయలు ఎక్కడ అని ప్రశ్నించారు. హామీ ఎప్పుడు అమలు చేస్తారని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ తాతా మాధవి లత మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, ప్రజల భద్రత కూడా ముఖ్యమని ఒకసారి 100 కోట్లని మళ్లీ ఒకసారి వచ్చి వెయ్యి కోట్లని మాయమాటలతో ప్రజలను మాయ చేయడం కాదని ఈ పర్యటనకు వచ్చే ముందు మీరు ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా ఈ జిల్లాకు రావాలని లేనిచో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనను మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బూర్గంపాడు మండల ప్రజల తరఫున అడ్డుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరించారు. టిడిపి పార్టీ తరఫున ఆందోళన తప్పదని హెచ్చరికలు చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు..
-----------------------
Admin