సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : నూగూరు వెంకటాపురం మార్చి02 ములుగు జిల్లా మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సీఆర్పీఎఫ్ ఈ /39 బెటాలియన్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో బాగంగా వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈ 39 సీఆర్పీఎఫ్ బెటాలియన్ కమాండెంట్ రమాకాంత్ పాండా ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ కమాండెంట్ ఇన్స్పెక్టర్ ఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు అంతేకాకుండా పోటీలో పాల్గొన్న జట్టులకు వాలీబాల్ కిట్లు వాలీబాల్ డ్రెస్ కోడ్ లను అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్ ఎస్సై అశోక్, సిఆర్పిఎఫ్ సిబ్బంది వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin