సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం తిమ్మమ్మరిమాను 600 సంవత్సరాల చరిత్ర గల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించిన ఆ గౌరవం వారసులకి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి తగ్గుతుంది అటువంటి చరిత్ర గలిగిన తిమ్మమ్మ మర్రిమాను ఇండోమెంట్ స్వాధీనం చేసుకుంటున్నట్లు ప్రజాభిప్రాయం లేకుండా కనీసం కమిటీ సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా ఇన్ని సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చిన తిమ్మమాంబ వారసుల అభిప్రాయం తెలుసుకోకుండా గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకున్నాము అని నోటీస్ ను గుడి కి అతికించడం బాధాకరమైనటువంటి అంశం అలాగే 2013లోనే మేము స్వాధీనం చేసుకున్నాం ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి చెందినది అని ఎండోమెంట్ అధికారి చెప్పడం ఆ గ్రామ ప్రజలకు అక్కడున్నటువంటి కమిటీ సభ్యులకి వారసులకి అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి ఎండోమెంట్ అధికారులు స్వాధీనం చేసుకునే ముందు సంబంధించిన వారసులకు గాని అక్కడ తరతరాలు కనిపెట్టుకున్నటువంటి ప్రజలకు గాని సేవ చేసినటువంటి భక్తులకు గాని చుట్టుపక్కల దాదాపు 40 గ్రామాల ప్రజలు అభిప్రాయ సేకరణ తెలుసుకోకుండా ఎండోమెంట్ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదని గ్రామ ప్రజలు భక్తులు ఆరోపణ చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాభిప్రాయ సేకరణ చేసి అధికారులు ముందుకు అడుగేస్తే బాగుంటుందని శ్రీ సత్య సాయి జిల్లా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న తెలియజేశారు తిమ్మమాంబ ఆలయాన్ని గాని అక్కడ ప్రాంతాల అభివృద్ధికి గాను వ్యతిరేకం కాదు ఎవరు అడ్డురారు కానీ తరతరాలుగా వందల సంవత్సరాలు వారసులు అక్కడ ఉన్నటువంటి భక్తులు గ్రామ పౌరులు ఎంతో సేవ చేసి ఈరోజు వాళ్లకు తెలియపరచకుండా 1974లోనే మీరు గుర్తించారు అన్నారు మరి 39 సంవత్సరాల తర్వాత స్వాధీనం చేసుకున్నాము అని మీరు అంటున్నారు 2013లో ఎండోమెంట్ పరం అయింది అంటున్నారు తొమ్మిది సంవత్సరాల తర్వాత 2022 సంవత్సరంలో ఇప్పుడు చెబుతున్నారు ఇలా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి కావున ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు పబ్లిక్ కి భక్తులకి ప్రజలకి పౌరులకి పూర్తిగా వివరినివ్వాలి అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా కోరుచున్నాము ఈ కార్యక్రమంలో రాయలసీమ చాలా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ గంగలమ్మ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin