సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం , సారపాక శక్తి కేంద్రంలో ఈరోజు శక్తి కేంద్ర ఇంచార్జ్ bjp కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల వెంకట్ రెడ్డి ఆధర్యంలో ,సారపాక సెంటర్లో ఈరోజు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.. ఈ మీటింగ్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ kcr తన పాలనలో ఒక్క అబద్ధం ఆడినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని తెలిపారని. అసలు కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో ఒక్క నిజమైన మాట్లాడారా అని విమర్శించారు... ప్రధాని నరేంద్ర మోడీ గారి సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు ఉచితంగా రేషన్, కరోనా వ్యాక్సిన్లల తో పాటు, ఇంటి నిర్మాణం కొరకు నిధులు విడుదల, గ్రామపంచాయతీ అభివృద్ధికి మంచి వర్ణ ప్రణాళికల ద్వారా నిధులు విడుదల చేస్తే దారి మళ్లించి అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు... దళితులకు మూడు ఎకరాల, భూమి పంపిణీ గిరిజన బంధు, 12% రిజర్వేషన్, డబల్ బెడ్ రూమ్స్ ,కేజీ టు పీజీ విద్య, నిరుద్యోగభృతి వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కిన Brs ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు... ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షుడు బీరకా సాయిశ్రీను , జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సీతారాం నాయక్ ,కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గుగులోతు బాలు నాయక్, మొరంపల్లి బంజర సర్పంచ్ భూక్య దివ్యశ్రీ ,బి ఎం ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వరరావు , కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు భూక్య వెంకటేశ్వర్లు, ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మహిళా మండల ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్ , మండల మహిళఅధ్యక్షురాలు అనిత, ఓబిసి మండల అధ్యక్షుడు వెలిశెట్టి రామారావు ,మరియు పిచ్చయ్య నాయుడు, బిజ్జం వెంకటరెడ్డి ,బిజెపి కార్యకర్తలు, ప్రజలు తదితలు పాల్గొన్నారు
-----------------------
Admin