సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని గరిడేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ కోరారు.మండల కేంద్రమైన గరిడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎంతో కాలం నుంచి జర్నలిజం వృత్తిగా భావించి పనిచేస్తున్నారని తెలిపారు.ఈ వృత్తి మీద ఏలాంటి జీతభత్యాలు లేకపోయినా సరే వృత్తిపై ఇష్టంతో ఎంతోమంది సామాజిక సేవ లో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో నిరంతరం పనిచేస్తూ ఉన్నారని తెలిపారు.హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని హుజూర్ నగర్ లో ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించిన విధంగానే గరిడేపల్లి మండలంలో పనిచేస్తున్న అందరు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల రూపాయల పథకాన్ని మంజూరు చేయించాలని కోరారు.గరిడేపల్లి మండలంలో అవసరమైన ప్రభుత్వ భూమి లభ్యంగాన్ని పక్షణ నియోజకవర్గ కేంద్రమైన హుజూర్ నగర్ లో అందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలను కేటాయించి జర్నలిస్టు కాలనీగా నామకరణం చేయాలని ఎమ్మెల్యేని కోరారు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడలేని విధంగా హుజూర్ నగర్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అందరికీ ఆదర్శంగా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మేల్యే సైదిరెడ్డి నిలవడం ఎంతో అభినందనీయమన్నారు. జర్నలిస్టుల ఇబ్బందులను కష్టాలను సమస్యలను ఎమ్మెల్యే గుర్తించి వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ముచ్చర్ల గోపాలకృష్ణ ,తాటికొండ లక్ష్మణ్ ,మేకపోతుల వెంకటేశ్వర్ల గౌడ్ ,నట్టే కోటేశ్వరరావు , బరిగెల విజయ్ కుమార్, బహుజన్ యల్లావుల వెంకటేష్, కడారి వెంకటేశ్వర్లు, కొలిపాక జగదీష్ ,చాగంటి వీరయ్య , రావుల వెంకన్న ,సండ్ర శివ, సైదులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin