Sunday, 26 July 2026 08:58:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠం పల్లి మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం...

Date : 30 September 2023 08:02 AM Views : 259

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మూడవత్ పార్వతి కొండా నాయక్ అధ్యక్షతన అధికారులతో సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈసందర్భంగా ఎంపీపీ పార్వతి కొండా నాయక్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, అందులో భాగంగా రైతు లకు రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ వంటి పథకాలు మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ , ఆరోగ్యలక్ష్మి, కెసిఆర్ కిట్టు, మిషన్ కాకతీయ మిషన్ భగీరథ వంటి పథకాలు అందిస్తున్నారని తెలియజేశారు.కెసిఆర్ తండాలను గ్రామపంచాయతీ లుగా గుర్తించారని, వాటికి కొత్త భవనాలను మంజూరు చేయించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో గుర్రంపోడు దగ్గర చెక్ డ్యాము నిర్మించి, భూగర్భ జలాలను పెంచారని, లిఫ్ట్ ద్వారా చివరి అయకట్టు వరకు రైతులకు నీరు అందుతున్నాయని తెలియజేశారు.ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సహకారంతో ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా గ్రామాలలో డ్రైనేజీలు సి.సి రోడ్లు వేశారని, సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఎస్డిఎఫ్ నిధులు 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారని గుర్తు చేశారు. ఆ పనులకు త్వరలోనే ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తో శంకుస్థాపన చేస్తారని, నియోజకవర్గంలోని అన్ని మండలాల, గ్రామాల మరియు తండాల లింక్ రోడ్లకు 65 కోట్లు ఎమ్మెల్యే సైదిరెడ్డి కృషితో మంజూరయ్యాయని త్వరలో ఎమ్మెల్యే చే శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు.వర్షాకాలం దృష్ట్యా గ్రామాలలో డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, విధి దీపాలు వెలిగేటట్లు చూడాలని, ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. స్వచ్ఛ తా హీ పక్షోత్సవాలు గ్రామాల్లో జరుపుకోవాలని, మండలంలో అక్టోబర్ 1న స్వచ్ఛ తా హి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జానకి రాములు, ఎంపీ ఓ ఆంజనేయులు, ఎంఈఓ ఛత్రు నాయక్, ఏపీవో ఉమా, ఏవో, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ నరసింహారావు నాగిరెడ్డి సైదమ్మ, ప్రభుదాసు, సైదా కుమారి కాశయ్య, సర్పంచ్ గోవిందు, ఐసిడిఎస్ అధికారి విజయలక్ష్మి, కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :