సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట పేద ప్రజలందరికీ గూడు,నీడ కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంతింటి కల నెరవేరబోతుంది ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో ఆరెల్లి రచన W/o నవీన్ అనే లబ్ధిదారుడు ఇంటి నిర్మాణం పూర్తి చేయగా,నర్సంపేట మండల కేంద్రంలో మొట్టమొదటి ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి,లబ్దిదారుని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. నియోజకవర్గంలో 3750 ఇండ్లు మంజూరు అయ్యాయని వివిధ దశలలో ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
-----------------------
Reporter