Sunday, 26 July 2026 09:52:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ - మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

Date : 08 October 2025 07:00 PM Views : 233

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో బాకీ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులలోనే 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 700 రోజులు గడిచినా కూడా ఇప్పటికీ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను, మహిళలను, యువకులను, నిరుద్యోగులను, వృద్ధులను ఇలా అన్ని వర్గాల ప్రజలను హామీలు ఇచ్చి మోసం చేసింది రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేసింది రైతులకు రైతు భరోసాను ఎగగొట్టింది, యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదు, పంటలకు సరిపడా యూరియాను అందివ్వలేదు రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా అందక పంటల దిగుబడి తగ్గింది చేతికివచ్చిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధర లేదు ఇప్పటివరకు మాక్కలు ,పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు ఎన్నికలకు ముందు మహిళలకు 2500 మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసింది వృద్ధులకు నెలకు నాలుగు వేల పెన్షన్ ఇంట్లో అవ్వ తాతలకు ఇద్దరికి ఇస్తామని మోసం చేసింది నిరుద్యోగులకు, యువతి యువకులకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు,స్కూటీలు ఇస్తామని మోసం చేసింది 22 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో హామీల అమలుపైన నిలదీయడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు బాకీ కార్డు లో ఉన్న ప్రతి హామీని నెరవేర్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఓటు అడగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రేపు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ లాంటివారు ఎన్నికలలో నిండా మునుగుడు ఖాయo ఈ కార్యక్రమంలో :-మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న ,మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ యాదవ్ . పిఎసిఎస్ చైర్మన్లు,చింతకింది వంశీ మురహరి రవి.మాజీ జెడ్పిటిసి పత్తి నాయక్ గారు,మాజీ ఎంపీపీ,మండల అధికార ప్రతినిది కంది కృష్ణ చైతన్య .మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు అనుముల కుమారస్వామి .అమ్మ రాజేష్. కొండవీటి ప్రదీప్ కుమార్ ,మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్.డైరెక్టర్లు.ఉపాధ్యక్షులు, మండల కార్యదర్శులు, కార్యదర్శిలు, కోశాధికారి,మండల యూత్ ప్రెసిడెంట్,అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు,యూత్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు ,మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ,మాజీ వార్డు మెంబర్ లు,మండల నాయకులు, కార్యకర్తలు,పార్టీ నాయకులు ,బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :