సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : తనకు [ నాగా సీతారాములు ] అసెంబ్లీ టికెట్ రాలేదని కార్యకర్తలు, అభిమానులు బాధ పడొద్దని, ఏఐసీసీ ఆదేశానుసారం టీపీసీసీ నిర్ణయాన్ని గౌరవించి ముందుకు సాగుదామని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కార్యకర్తలను ఉద్దేశించి ప్రకటన చేశారు . పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పటి నుండి తనకు చేదోడు వాదోడుగా ఉండి నాకు అండగ ఉన్న, కార్యకర్తలకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. నాయకుడు పార్టీ మారి వెళ్లిన కూడ మొక్కవోని ధైర్యంతో పార్టీ మీద అభిమానంతో అధికార పార్టీని ఎదిరించి నాతో పాటు జెండా మోసిన కార్యకర్తల సహకారం ఎప్పుడు మర్చిపోనన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్, పార్లమెంట్ ఎన్నికల సమయంలో తన వెంట నడిచి తనకు ధైర్యాన్ని ఇచ్చిన కార్యకర్తలు, అభిమానులకు ఋణపడి ఉంటానని ఎవరిని మర్చిపోనని, రాబోయే రోజుల్లో కూడ మీకు అండగా ఉంటానని తెలిపారు. ఎవరు ఏ మాత్రం బాధపడొద్దని కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని పొత్తుల్లో భాగంగా అసెంబ్లీ సీటు సిపిఐ కి కేటాయించిందని ఎవరు నిరాశ పడొద్దని, బాధ పడొద్దని అందరం ఒకే కుటుంబంలా కలిసి ఉందామని విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin