సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం ఆగస్టు 5వ తేదీ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల కేంద్రంలో ఎస్ టి గిరిజన వసతి గృహంలో జరిగిన సంఘటన గిరిజన విద్యార్థుల చేత వసతి గృహంలో చపాతీలు చేయిస్తున్న వార్డెన్, ప్రిన్సిపాల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. వసతి గృహంలో సిబ్బంది కొరతగా ఉంటే పై అధికారులకు తెలియజేసి సిబ్బంది కొరత లేకుండా చూడవలసిన వార్డెన్ ప్రిన్సిపాల్ పిల్లల చేత వెట్టి చాకిరి చేయించి పబ్బం గడుపుకోవటం చాలా విడ్డూరంగా ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహములోని వార్డెన్ విద్యార్థులను భయపెట్టి భయాందోళనలకు గురి చేస్తూ విద్యార్థుల చేత వెట్టిచాకిరి చేయించడం క్షమించరా నేరమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు అంటున్నారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు నిరీక్షణ బాబు హుటా హుటున గిరిజన వసతి గృహానికి వచ్చి పరిశీలించగా హాస్టల్ సిబ్బందిని విద్యార్థులను సపరేటుగా విచారించి వాస్తవాలు తెలుసుకున్నాడు. ఈ సందర్భంగా నిరీక్షణ బాబు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల చేత విలేకరులే చపాతీలు చేయించారని విలేకరులపైనే ఈ నేరం మోపటం చాలా యుడ్డూరంగా ఉందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నిరీక్షణ బాబు గిరిజన వసతి గృహం లోని ఇబ్బందిని. వార్డెన్, ప్రిన్సిపాలులను సమర్ధించి మాట్లాడడం వారికి అనుకూలంగా మాట్లాడడం మొత్తం విలేకర్లే చేయించారని వారిపై నెపము మోపటం చాలా బాధాకరమైన విషయమని రాజకీయ నాయకులు ప్రజలు అంటున్నారు. ఏది ఏమైనా ఎక్కడ అన్యాయం జరిగిన జరిగిన సంఘటనను బయటికి తీసి....
-----------------------
Admin