సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలవుతున్న వివిధ రకాల పథకాలకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలను బ్యాంకర్లు త్వరితగతిన చేరుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. పుట్టపర్తి కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం జిల్లా సంప్రదింపుల కమిటీ మరియు జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు, పంపిణీని బ్యాంకర్లు వేగవంతంగా చేపట్టాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరులో బ్యాంకర్లు వెంటనే పురోగతి సాధించేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్టాండప్ ఇండియా, పీఎం ముద్ర యోజన కింద రుణాలు, వీవర్స్ కు, పశుసంవర్ధక మరియు మత్స్య రైతులకు రుణాలు అందించడంలో మరింత పురోగతి చూపించాలన్నారు. జగనన్న తోడు పథకం కింద డిఆర్డిఏ, మెప్మా పరిధిలో చిరు వ్యాపారులకు అందించే రుణాల లక్ష్యం చేరుకోలేదని, వెంటనే అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలను మంజూరు చేసి పంపిణీ చేసేలా చూడాలన్నారు. జగనన్న తోడు, టిడ్కో, హౌసింగ్ కి సంబంధించి రుణాల మంజూరు చాలా పెండింగ్ ఉందని, వెంటనే కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఆయా పథకాలకు సంబంధించి రుణాల మంజూరులో అధికారులు, బ్యాంకర్ల మధ్య సమన్వయం సక్రమంగా ఉండాలన్నారు. రుణాల మంజూరులో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకునేలా కృషి చేయాలని, కేటాయించిన లక్ష్యాలను పూర్తిగా 100 శాతం చేరుకోవాలన్నారు. ముఖ్యంగా బ్యాంకుల ద్వారా ఆర్థిక స్వాలంబన కొరకు రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాల ద్వారా సక్రమంగా రికవరీ పై దృష్టిని సారించాలన్నారు. అలాగే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారందరూ తిరిగి చెల్లింపులను సకాలంలో చెల్లించాలన్నారు. ప్రతి నెల బ్యాంకర్లతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆయా సమావేశంలో కచ్చితంగా మున్సిపల్ కమిషనర్లు కూడా హాజరై విధంగా లీడ్ బ్యాంకు మేనేజర్ చర్యలు చేపట్టాలని తెలిపారు. డిఐసిసిఐ జిల్లా కోఆర్డినేటర్ సభ్యులు కెవి రమణ మాట్లాడుతూ ముఖ్యంగా అర్హత కలిగిన ఎస్సీ ,ఎస్టీ, ఔత్సాహికులను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన స్టాండర్డ్ ఇండియా పథకం పై అవగాహన శిబిరాలు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని తెలిపారు అనంతరం బ్యాంకుల లక్ష్యాల గురించి నాబార్డ్ ఏజీఎం ద్వారా రూపొందించిన ప్రొటెన్షియల్ లింక్ క్రెడిట్ ప్లాన్ పి ఎల్ పి పుస్తకాన్ని (2023 - 2024) 2023 - 24 కు సంబంధించి 741575.39 కోట్ల రూపాయలతో జిల్లా వార్షిక ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వార్షిక ప్రణాళికను జిల్లా కలెక్టర్, ఎల్డిఎం లు, తదితరులు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ , వివిధ బ్యాంకర్లచే ఎల్డియం ఆధ్వర్యంలో ప్రస్తుత నాబార్డ్ డిడి ఉషా మధుసూదన్ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా ఆమెకుఆత్మీయ సత్కారం చేశారు. ఈకార్యక్రమంలో ఆర్బి.ఐ .ఎల్. డి.ఓ., శరత్ చంద్ర ,ఎల్ డి యం సాయినాథ్ రెడ్డి, కెనరా బ్యాంకు ఏజీఎం రాంప్రసాద్ రెడ్డి ,ఎస్ బిఐ ధర్మవరం ఆర్ఎం సంజీత్ కుమార్, యూబీఐ బ్యాంక్ ఎజీ యం అశ్వర్థ నాయక్, నాబార్డ్ డిడి ఉషా మధుసూదన్, డిఆర్డిఏ పిడి నర్సయ్య, మెప్మా పీడీ విజయలక్ష్మి, సెరికల్చర్ జేడీ పదమ్మ, డీఐసీ జనరల్ మేనేజర్ చంద్రబాబు,, డిహెచ్టిఓ రమేష్, , డిఐసిసిఐ కెవి రమణ, వివిధ శాఖ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin