Sunday, 26 July 2026 11:25:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుంది... -మాజీ మంత్రి పల్లె

Date : 17 December 2022 12:48 AM Views : 400

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : అమడగూరు మండలం కొట్టువారిపల్లిలో "ఇదేమి కర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలనను అవలంబిస్తున్నారని, వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందు ఎండగడతాం అని మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన అమడగూరు మండలం కొట్టువారి పల్లి పంచాయితీలో కార్యకర్తలతో కలిసి ఇదేం కర్మ - మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇంచార్జి నుంచి గ్రామ స్థాయి అధ్యక్షుడు వరకు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇవ్వటమే లక్ష్యంగా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ ఈ మూడున్నర సంవత్సరకాలంలో వైసీపీ చేసిన అక్రమాలు, పెరిగిన నిత్యావసర ధరలు, తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై, అన్యాయాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు నుంచి వారి సమస్యలను తెలుసుకుంటూ మీకు అండగా నేను ఉంటానని వెన్ను తట్టి వారికి గట్టి భరోసా కల్పించారు. రాబోయే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని రానున్న ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :