సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయస్థాయి అవార్డు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు భారత రాష్ట్రపతి గౌరవనీయులైన శ్రీమతి ద్రౌపది మూర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట పిహెచ్సి మద్దుకూరు సబ్ సెంటర్లో ఏఎన్ఎం గా సేవలందిస్తున్న టి సుశీల రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న శుభ సందర్భంలో జిల్లాస్థాయి అధికారులు డిఎంహెచ్వో, పెద్దిరెడ్డిగూడెం సర్పంచ్, నున్న బసవయ్య, పిహెచ్సి సిబ్బంది డాక్టర్ ప్రియాంక ,డాక్టర్ తన్మయి ,ఎంపీడీవో అన్నపూర్ణ,ఎంఈఓ, అంగన్వాడి సూపర్వైజర్స్, అంగన్వాడీ టీచర్లు, మరియు ఇతర ఏఎన్ఎంలు గ్రామ ప్రజలు సుశీల దంపతులను ఎంతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొని హాజరైన వ్యక్తులందరికీ భోజనాలు నిర్వహించడం జరిగింది. ఈ అవార్డు అందుకున్నందుకు ఎర్రగుంట హాస్పిటల్స్ సిబ్బంది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
-----------------------
Admin