Monday, 27 July 2026 05:28:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పై కాంగ్రెస్ నాయకుల మీడియా సమావేశం...

Date : 25 June 2023 12:16 AM Views : 655

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణంపై కాంగ్రెస్ నాయకులు కోల వెంకటేష్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అధికారం లోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు నియోకవర్గంలో లబ్ధిదారులకు ఒక డబుల్ బెడ్ ఇల్లు ఇవ్వలేదు అని డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం పూర్తికాని నియోకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఆర్మూర్ నియోజకవర్గమే అని అన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మేనిఫెస్టోలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను అవహేళన చేస్తూ అల్లు వస్తే ఎక్కడ పండుకుంటారు అని అంటూ మేం అధికారంలోకి వస్తే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు అని అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాత్రం తన కోసం అంకాపూర్ లో హైదరాబాదులో రాజభవనాలు నిర్మించుకున్నాడు. అని ఇవి కాక మినిస్టర్ క్వార్టర్లో ఎమ్మెల్యే క్వార్టర్ల్లో ఇండ్లు పొందాడు కానీ తమకు ఓటు వేసిన ప్రజలకు మాత్రం ఇప్పటివరకు ఒక ఇల్లు ఇవ్వలేదు అని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం కాకముందే ప్రజలకు అప్లికేషన్ ల పేరు మీద మభ్యపెడుతున్నారు అని అన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఆదేశాలకు కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు సొంత ప్లాట్ ఉన్న వారికి ఇంటి నిర్మాణ డబ్బులు ఇస్తున్నారు అని అబద్ధాలు చెప్పి దరఖాస్తు తీసుకొని ప్రజలను తప్పుదో పట్టించారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి ఉంది అని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ అధికారంకు వస్తే ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద సొంత స్థలం ఉన్నవారికి ఐదు లక్షలు ఇస్తాం అనగానే భయపడి కెసిఆర్ కొత్తగా గృహలక్ష్మి పథకం తెస్తున్నాడు అని సొంత స్థలం ఉన్నవారికి మూడు లక్షలు ఇస్తా అని అంటున్నాడు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికి కెసిఆర్ వస్తున్నాడు అని ప్రజలు అప్రమత్తం ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది అనే స్థానిక ఎమ్మెల్యే జీవన్ పదేపదే చెప్తారని. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇంద్రమ్మ ఇండ్లు లేని గ్రామాన్ని ఎమ్మెల్యే చూపెట్టాలి అని డబుల్ బెడ్ రూమ్లు లేని ఊరుని మేము చూయిస్తామని కోలా వెంకటేష్ సవాల్ చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయి ఉండి కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో ఎమ్మెల్యే విఫలం అయ్యారు అని అన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం జర్నలిస్ట్ మిత్రులకు జూన్ 18 వారికి కుటుంబాలతో గృహప్రవేశం కి రావాలని మీకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని అన్నారు. 24 తేదీ అని జర్నలిస్ట్ లకు ఇల్లు ఎక్కడ అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో నాయకులు అజ్జు, జిమ్మి రవి, మందుల పోశెట్టి, పట్టు శంకర్,బాల్ కిషన్,పాషా,పెద్ద పోశెట్టి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :