సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మునుగోడు ఉప ఎన్నికలో ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కోరారు.సోమవారం నాంపల్లి మండలం చిట్టెంపాడు గ్రామంలో టిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ.....మునుగోడు నుండే బిజెపి పతనం ఖాయం అని ఆయన తెలిపారు.మోదీ హయాంలో దేశం నిలువు దోపిడీ చేస్తున్నారు అని ఆయన అన్నారు.కాంట్రాక్టులు,స్వార్ధ ప్రయోజనలకే ఉప ఎన్నిక అని ఆయన అన్నారు.ఏడుదశబ్దాల ప్రభుత్వ సంపదను అమ్ముకున్న మోదీ సర్కార్ అని ఆయన అన్నారు.బిజెపిని ఉపేక్షిస్తే దేశాన్ని అమ్ముకుంటారు అని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో అభివృద్ధి జరుగుతుంది అని ఆయన అన్నారు.జరగాల్సిన అభివృద్ధి పై పోరాడతాం అని ఆయన అన్నారు.ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు.మోదీ, అమిత్ షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపును నిలువరించలేరని ఆయన అన్నారు.కాంగ్రెస్ పార్టీ మునిగి పోయే పడవగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నానాటికి పెరుగుతున్న విశ్వసనీయతకు టిఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న వలసల ప్రవహమే నిదర్శనమన్నారు.రాష్ట్ర అభివృద్ధి టిఆర్ఎస్ తోటే సాధ్యం అవుతుందన్న నమ్మకం ప్రజల్లో బలపడిందని,దానితో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన అన్నారు.కోటి ఎకరాల మాగాణికి నడుం బిగించిన రైతు బాంధవుడు,మహాదార్శనిక నేత కేసీఆర్ ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందడం ఖాయమని అన్నారు. ఆయనకు మునుగోడు నియోజకవర్గ ప్రజల మద్దతు మెండుగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలను సృష్టించాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంఛార్జీ గా కొనసాగుతూ విశేష సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. రైతుల్లో నవచైతన్యానికి సీఎం కేసీఆర్ నాంది పలికారు. రైతు బంధు పథకం ద్వారా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేలు పంట సాయం అందిస్తున్నదని రైతులను చైతన్యపరిచారు. అన్నదాత మృతి చెందిన వారం రోజుల్లో రైతు బీమా పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి సర్కారు రూ.5 లక్షలు అందజేస్తున్నదని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. రైతులు పండించిన పంటకు మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి కీలకంగా మారనున్న సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం,విత్తనాలు, ఎరువుల సాయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘంగా చర్చించి సమస్యల పరిష్కారంపై తనదైన ముద్ర వేశారు. మిషన్ భగీరథ పథకం ద్వారా అడుగంటిన 45వేల చెరువుల పునరుద్ధరణ కోసం కృషి చేశారు. 24 గంటల ఉచిత విద్యుత్ గురించి అన్నదాతల్లో చైతన్యం పెంచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సాగుకు స్వర్ణయుగం కొనసాగుతోందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు ప్రాజెక్టుల నిర్మాణాలను నిర్లక్ష్యం చేశారని, పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 17వేల కోట్ల రుణమాఫీ, రెండోసారి అధికారంలోకి రాగానే లక్ష లోపు ఉన్న రుణమాఫీ చేశారని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి బడ్జెట్ నుంచే ప్రతీసారి 25వేల కోట్లు కేటాయిస్తూ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు. కేవలం మూడున్నరేండ్లలో కాళేశ్వరం లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టును నిర్మించి ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు.2014లో 6 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గోదాములను 24 లక్షల మెట్రిక్ టన్నులకు సర్కారు పెంచిందన్నారు. 49 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యమున్న గోదాముల నిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని అన్నారు. భారత గిడ్డంగుల సంస్థ దేశ వ్యాప్తంగా సేకరించిన వరి ధాన్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచే 54 శాతం సేకరించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే బువ్వపెట్టే అన్నపూర్ణగా విరాజిల్లిందని చెప్పారు. గతేడాది నాటికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 108 నోటిఫికేషన్లు విడుదల చేసి 1,31,109 ప్రభుత్వ ఉద్యోగాలను సర్కారు భర్తీ చేసిందని చెప్పారు. ఇంకా అనేక నోటిఫికేషన్లను విడతాలవారీగా ప్రభుత్వం ప్రకటిస్తోందన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. తద్వారా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కృష్ణపట్టెలో ఆంధ్రప్రాంత ఆధిపత్యానికి చెల్లుచీటి లభించిందని అన్నారు.యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో మన ఇంజినీర్లు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు.కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకున్నారని అన్నారు.గతేడాది డిసెంబర్ లో 7 శాతం ఉన్న నిరుద్యోగిత గతనెలలో 4.5 శాతానికి తగ్గిందని అన్నారు. నూతన మెడికల్ కళాశాలల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండిచేయి చూపిందన్నారు. కొత్తగా మంజూరైన 157 వైద్య కళాశాలల్లో తెలంగాణ కు ఒక్క కళాశాల మంజూరు కాకపోవడం శోచనీయమని అన్నారు. సాంఘీక సంక్షేమ గురుకులాల నిర్మాణం ద్వారా 5వ తరగతిలో ప్రతీ ఏటా 18,500 సీట్లను భర్తీ చేస్తున్నామని అన్నారు. గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రతీ విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు ఖర్చు పెడుతున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు298 గురుకులాలు ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 661కు పెరిగిందని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24,205 కోట్లు ఇవ్వాలని నితి అయోగ్ సిఫారసు చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితిగా రూపాంతరం చేశారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన అనంతరం దేశ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోందన్నారు. రాజకీయంలో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారని అన్నారు. మునుగోడు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఉప ఎన్నికలో కారు గుర్తుపై ఓటు నమోదు చేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.బిజెపి తో దేశానికి ప్రమాదకరం అని ఆయన అన్నారు.ప్రగతిశీల శక్తులకు స్నేహ హస్తం అని ఆయన అన్నారు.అందుకే వామపక్షాల తో కలసి పోరాటం చేయనున్నట్ల ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో రైతు బంధు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,కంకణాల వెంకట్ రెడ్డి,TVN రెడ్డి, వెలుగురి వల్లపు రెడ్డి,ఉజ్జిని విద్యాసాగర్ రావు,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin