సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండల కేంద్రంలోని సాగర్ సిమెంట్ మైనింగ్ విస్తరణ దళిత భూములకు ముప్పు పొంచి ఉందని ఈ విస్తరణతో వెదజల్లే కాలుష్యం సాగుకు అనుకూలంగా ఉన్న భూములు సారాన్ని కోల్పోతాయని భూగర్భ జలాల సామర్థ్యాలు తగ్గుతాయని వాపోతున్నారు. పరిశ్రమ ఏర్పడి 40 ఏళ్లు అవుతున్నప్పటికీ సంబంధిత గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి సహకరించలేదని విద్యా అర్హతలు ఉన్న స్థానికులకు తగిన ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు .ఈ పరిశ్రమ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని మైనింగ్ విస్తరణకు అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ సూర్యపేట జిల్లా కలెక్టర్ జడ్పీ సీఈవో జిల్లా పరిశ్రమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అన్నారు. సాగర్ సిమెంట్ యొక్క సున్నపు రాయి గని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.8 నుండి 5.4 ఎంపీపీఏ కు పెంచుటకు వీటితోపాటు 1X1000 టి పి హెచ్ క్రషర్ ను నెల కొల్పుటకు ప్రస్తుతం ఉన్న లీస్ ఏరియా అయినా 328 .58 హెక్టారులలో సున్నపురాయి గని ని ఈ నెల 17 న ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కోరుతూ పెదవీడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మైనింగ్ ఏరియా కు దగ్గరగా ఉన్న దళిత రైతులు తమ భూమిని కోల్పోయి పరిస్థితి వస్తుందని తెలిపారు
-----------------------
Admin