Monday, 27 July 2026 11:41:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్" వేడుకలు...

Date : 11 May 2023 12:10 AM Views : 514

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు ఘనంగా జరిగిన "డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్" వేడుకలు, ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్, క్రీడా పోటీలలో గెలుపొందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి బహుమతులను అందించిన ఎస్పీ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురం నందు డిస్ట్రిక్ట్ పోలీస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సంబురాలు అంబరాన్నంటాయి. గత మూడు రోజులుగా నిర్వహించిన క్రీడా పోటీలలో జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్వహించిన అన్ని క్రీడా పోటీలు కూడా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గొన్నారు. గౌరవ అతిథిగా ఆయన సతీమణి ప్రీతి పాల్గొన్నారు. ముందుగా ముఖ్యఅతిథిని 09 ప్లాటూన్లతో స్పోర్ట్స్ పెరేడ్ ద్వారా ఆహ్వానం పలికారు. అనంతరం 100 మీటర్ల పరుగు పందెం ఫైనల్ మరియు టగ్ ఆఫ్ వార్ ఫైనల్ పోటీలను నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నిరంతరం విధి నిర్వహణలో ప్రజలకు సేవలందిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు, వ్యాయామం ఒక భాగంగా ఉండాలని, ముఖ్యంగా పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఎదో ఒక వ్యాయామం గానీ, క్రీడను గానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు. క్రీడలలో గెలుపోటములు సాధారణమని, క్రీడా స్పూర్తితో ఓటమిని కూడా ఆనందంగా స్వీకరించినప్పుడే జీవితంలో కూడా ఒడిదుడుకులను ఎదుర్కోగలమని అన్నారు. అనంతరం ఈ క్రీడలలో గెలిచిన క్రీడాకారులకు బహుమతులను, ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం స్పోర్ట్స్ మీట్ కు ప్రతీకగా సూచించే పోలీస్ పతాకాన్ని ఎస్పీ గారికి క్రీడాకారులు అందించారు. అనంతరం పటాసులు కాల్చి క్రీడా సంబురాలను ఘనంగా ముగించారు. క్రీడా పోటీల్లో అన్ని సబ్ డివిజన్ల నుండి పోలీస్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గోన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :