సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరిన షాద్ నగర్ ఎన్ఎస్ యూఐ నేషనల్ కన్వీనర్ దినేష్ సాగర్. గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దినేష్ సాగర్ తో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డోంట్ వర్రీ నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చినట్టు చెప్పారు. నియోజకవర్గంలో యువత టిఆర్ఎస్ వైపు చూస్తుందని ఇది శుభశకునం అని ఆయన పేర్కొన్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై. రవీందర్ యాదవ్, మాజీ జెడ్పి వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
-----------------------
Admin