Sunday, 26 July 2026 03:58:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నర్సంపేటలో మౌన దీక్ష

Date : 07 November 2025 07:07 AM Views : 153

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ బీసీ జెఏసి రిజర్వేషన్ల పోరాటాన్ని పల్లె పల్లెకు విస్తరింప చేస్తాం బీసీ జేఏసీ వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ వరంగల్ జిల్లా నర్సంపేటలో బీసీ జెఏసి జిల్లా వైస్ చైర్మన్ కడారి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిసి జెఏసి మౌన దీక్ష కార్యక్రమానికి బిసి జెఏసి వరంగల్ జిల్లా చైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ హాజరయ్యారు. నర్సంపేట మౌన దీక్షలో డ్యాగల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర బిసి జెఏసి నవంబర్ 2వ తేదీన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర బిసి జెఏసి రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు బిసి జెఏసి నాయకులు ప్రకటించిన అష్టాంగ ఆందోళనలలో భాగంగా గురువారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ల మౌన దీక్షలను వరంగల్ జిల్లాలో ఎక్కడికక్కడ బిసి జెఏసి, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో పాటు మూతికి నల్ల గుడ్డలు కట్టుకుని మౌన దీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని డ్యాగల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జనాభాలో 10 శాతం కూడా లేని అగ్రవర్ణాలకు ఈ డబ్ల్యూ ఎస్ పేరుతో ఎలా ఇచ్చారని జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలకు మాత్రం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించకుండా అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగా, ఓట్లు వేయించుకునే యంత్రాలుగానే వాడుకుంటున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే మద్దతును ఇచ్చిన బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి బిజెపికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. బీసీ జెఏసి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని బీసీ రిజర్వేషన్లను సాధించే వరకు పోరాటాలు కొనసాగుతాయని అన్నారు. బిసి జెఏసి ఆధ్వర్యంలో డిసెంబర్ మొదటి వారంలో పెద్ద ఎత్తున బీసీల ఛలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, అదే విధంగా జనవరి 4వ వారంలో లక్షల మందితో వేల వృత్తులు... కోట్ల గొంతులు... అనే నినాదంతో హైదరాబాదులో మిలియన్ మార్చ్ తరహాలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మౌన దీక్ష కార్యక్రమానికి బీసీ కుల సంఘాలు, ఎమ్మార్పీఎస్, లంబాడి జెఏసి లు మద్దత్తు తెలిపారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్లు కడారి సురేష్ యాదవ్, కురిమిల్ల రమేష్, కో చైర్మన్లు చిలువేరు కొమ్మాలు, ఓర్సు సాంబయ్య, చెన్నారావుపేట మండల అధ్యక్షులు బర్ల యాకయ్య, దుగ్గొండి మండల జెఏసి వైస్ చైర్మన్ కానుగుల కుమారస్వామి, బీసీ మండల నాయకులు నూనె రంజిత్ ముదిరాజ్, మారపాక రమేష్ ముదిరాజ్, శీరంశెట్టి రాజేందర్ పెరక, శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు చిలువేరు కొమురయ్య మేదర సంఘం జిల్లా నాయకులు శేర్ల శ్రీనివాస్, నాయిబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గొలనకొండ రవీందర్, ఉపాధ్యక్షుడు సూత్రపు సాంబయ్య, వల్లాజి సురేష్ కుమార్, కార్యదర్శి మొగిలిచర్ల రవీందర్, లంబాడి జెఏసి నాయకులు గుగులోతు కిషన్ నాయక్, జాటోతు బాలు నాయక్, భూక్య హరి ఎమ్మార్పీఎస్ నాయకులు నిరంజన్ మునిగే యాకూబ్, మాదాసి బాబు, గుండేటి వీరేష్ లంబాడి జెఏసి నాయకులు గుగులోతు కిషన్ నాయక్ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కల్వచర్ల సత్యనారాయణ, మారేడుగొండ బ్రహ్మచారి, వడ్డెర సంఘం నాయకులు ఆలకుంట నాగులు బొంత శివ, బీసీ నాయకులు పాలడుగుల రాజేందర్, మేడి సంతోష్, మొర్రి కట్టయ్య బీసీ సంఘం నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :