సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామ సర్పంచ్ లక్ష్మీ నరసింహ రాజు ఆధ్వర్యంలో గ్రామసభను నిర్వహించారు గ్రామంలో గత కొంతకాలం క్రితం నిర్మించబడి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కై గ్రామస్తుల నుంచి దరఖాస్తులను కోరడం జరిగింది.మొత్తం 20 డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఉండగా గ్రామస్తుల నుంచి 231 దరఖాస్తులు వచ్చాయి .వాటిలో థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వయిరీ చేయగా 29 మందిని నిజమైన లబ్ధిదారులుగా గుర్తించారు.అందులో 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మాత్రమే నిర్మాణంలో ఉండగా మిగిలిన 9 మందికి కాళీ ప్లాట్లను మంజూరు చేశారు.డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కాగా మిగిలిన కాళీ ప్రదేశాన్ని 72 ప్లాట్లుగా విభజించారు.వీటి కొరకు గ్రామస్తుల నుంచి దరఖాస్తు కోరగా 184 మంది దరఖాస్తు చేసుకున్నారు వాటిలో ఫ్లాట్ ల కొరకు నిజమైన లబ్ధిదారుల్ని ఎంక్వయిరీ చేయగా 63 మందిని గుర్తించారు .మొత్తంగా గ్రామంలో నిజమైన లబ్ధిదారులకు 20 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు 72 ప్లాట్లను మంజూరు చేశారు .ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల ఆర్ ఐ ,జడ్పిటిసి జగన్ నాయక్ ఉప సర్పంచ్ శాంతి నరసింహారెడ్డి వార్డు మెంబర్లు శ్రీదేవి , కాటాల లింగయ్య ,కొత్తూరు వెంకన్న ,కుక్కల రమణ మండల పార్టీ నాయకులు కోలాహలం కృష్ణంరాజు, సైదా హుస్సేన్ నాగుల్ మీరా ,నాగరాజు సోషల్ మీడియా ఇన్ఛార్జి బైరి నరేష్ ,గొట్టం ప్రకాష్ ,బొమ్మకంటే బాలనాగయ్య గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin