సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి, సత్య సాయి జిల్లాలో జరుగుతున్న భూ రీ సర్వే పక్రి య లో నాణ్యత చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్ తాసిల్దారులను హెచ్చరించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలు నందు జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంపై రెండవ రోజు జరిగిన వర్క్ షాప్ నందు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, ల్యాండ్ అండ్ సర్వే సహా సంచాలకులు రామకృష్ణయ్య, జిల్లాలోని పుట్టపర్తి డివిజన్, పెనుగొండ డివిజనసంబంధిత తహల్దారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వేలో పక్రియలు తప్పు చేస్తే వారిని కఠినంగా శిక్షించడం జరుగుతుందని తాసిల్దార్ హెచ్చరించారు. భూ వివాదాలు, తగాదాలు గ్రామాలు సాక్షాత్కారమే కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. ఈ మహా యజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలి. ఎక్కడ కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయింది అన్నమాట. మొబైల్, ట్రిబనల్, సరిహద్దులు, సబ్ డివిజన్లో ఇవన్నీ చాలా క్రమబద్ధతలో ముందుకు సాగాలి....
-----------------------
Admin