సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం మన కొత్తగూడెం-మన కామేష్ పేరుతో మండలంలోని రేగులగూడెం,మామిడి గూడెం,చంద్రలగూడెం,మల్లారం గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ముందుగా ఫూలే,అంబెడ్కర్,కాన్షిరం గార్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ స్వాత్రంత్రం వచ్చి 76 యేండ్లు గడుస్తున్నా నేటికి నియోజకవర్గంలో కనీస అవసరాలైన ఇల్లులు లేవని ప్రజలు తడికలతో కట్టుకున్న ప్రహరీలతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఎవరు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు త్రాగునీరు,విద్యుత్,డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విపలమయ్యరని విమర్శించారు.ఈసారి ఎన్నికలు స్థానికులకు-వలస వాదులకు మధ్య జరుగుతున్న పొరుగా వర్ణించారు.ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న అవినీతి పరులను ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.నియోజకవర్గ అభివృద్ధి బీఎస్పీతోనే సాధ్యమని ఈ గడ్ద మీద పుట్టిన బిడ్డగా ఆశీర్వదించాలని కోరారు. ఈకార్యక్రమంలో మండల,పట్టణ అధ్యక్షులు కాటబోయిన వసుంధర,కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,జిల్లా మహిళా అధ్యక్షురాలు బండి రమణి,అసెంబ్లీ మహిళా అధ్యక్షురాలు కేతిని కుమారి,ఎర్రంశెట్టి రాజేశ్వరి,ఏడెల్లి మర్థమ్మ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin