Sunday, 26 July 2026 08:01:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇండ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేసేందుకు కృషి చేస్తానని... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు

Date : 24 January 2023 12:56 AM Views : 613

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ నిండు భారీ బహిరంగసభ, మూడు రాష్ట్రాల సీఎంలు, లక్షలాదిమంది ప్రజల సమక్షంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఒక్క నెలలో కేటాయిస్తామని, ఆ భరోసాను నాకు. ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించిన ఇండ్ల స్థలాల కేటాయింపును పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను తన భుజస్కంధాలపైనే ఉందన్నారు. ఈనెల 18న జరిగిన బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు కేటాయించాలని ఇచ్చిన హామీని ఖమ్మం జర్నలిస్టుల పక్షాన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి సల్పినందుకు గాను సోమవారం టీయూ డబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవిల ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఖమ్మం నగరంలోని విడివోఎస్ కాలనిలో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ ఇచ్చిన అస్యూరెన్స్ ను తూచా తప్పకుండా పాటించేందుకు ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు సహకారంతో ఇండ్ల స్థలాల కేటాయింపు పూర్తిచేస్తామన్నారు. గతంలోనే జర్నలిస్టుల ఉమ్మడి బహిరంగసభలో, ప్రెస్ అకాడెమీ ఛైర్మెన్ సమక్షంలోనే ఇండ్ల స్థలాల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు స్థలాల కేటాయింపులో ప్రభుత్వ స్థలం లేకపోతే, ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసైనా ఇండ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టంగా తెలియజేశారు. ఇంతహామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు మనం అందరం కృతజ్ఞతలు తెలపాలని సూచించారు. ఇప్పటికే జర్నలిస్టులకు అనువైన ప్రభుత్వ స్థలాన్ని చూడాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్ లకు సూచించినట్లు తెలిపారు. ఖమ్మంలో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత మిగతా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు మార్గదర్శకాలు ఇస్తానని తెలిపారు. ఇండ్ల స్థలాల కేటాయింపులో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలతో ప్రణాలికను తయారు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రెస్ క్లబ్ స్థల కేటాయింపుతో పాటుగా నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీయూడబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ. గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్టులు ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల కోరిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో నెరవేరుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూయుజె(టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, టెంజూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి కొరకొప్పుల రాంబాబు, టెంజూ నగర అధ్యక్షకార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్ నాయకులు రాజేంద్రప్రసాద్, యం. కోటేశ్వరరావు, జానిపాషా, టీఎస్ చక్రవర్తి, బిక్కి గోపి, బోయిన కృష్ణ, పిన్ని సత్యనారాయాణ, మోహన్, జక్కుల వెంకటరమణ, వెంపటి నాయుడు, యాదగిరి, పానకాలరావు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: