సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మే19 :--- మండల కేంద్రంలో సుందరయ్య కాలనీలో శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రమణ ,సి ఐ టి యు మండల అధ్యక్షులు కుళ్లాయప్ప, సిఐటియు ట్రాన్స్పోర్ట్ రంగం, సత్య సాయి జిల్లా కార్యదర్శి బాబా వలి, పాల్గొని వారు మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య నిస్వార్థ ప్రజా సేవకుడని, ఆయన నిత్యం ప్రజల కోసం కార్మికుల కోసం రైతుల కోసం వ్యవసాయ కూలీల కోసం అనేక పోరాటాలను నిర్మించారని కొనియాడారు. ప్రజాసేవ కోసం సంతానాన్నే వద్దనుకున్న మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ సైకిల్ లోనే పార్లమెంటుకు వెళుతూ ఇతర సభ్యులకు భిన్నంగా తన జీవనశలిని గడిపారని తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న రాజకీయ నాయకులలో మచ్చుకైనా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ప్రజానాయకుడు లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin