సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డిఎల్ఎస్సి) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చేతన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాధాన్యత ప్రకారం నాడు - నేడు పనులు, హౌసింగ్ పరిధిలో ఇళ్ల నిర్మాణం, తదితర ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా చేయాలని, ఆయా పనులకు ఇసుక కొరత లేకుండా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారులంతా సమన్వయంతో పనిచేసే ఇసుక సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. ఒక పద్ధతి ప్రకారం ఇసుక సరఫరా జరిగేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ఇసుక సరఫరా చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కూడా ఇసుకను సిద్ధంగా ఉంచాలని, మున్సిపల్ కమిషనర్లతో జెపి కంపెనీ వారు నిత్యం సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఇసుక సరఫరాలో ఎలాంటి తప్పులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా హిందూపురం మండలంలోని తూముకుంట గ్రామం వద్ద పెన్నా నదిలో 3.590 హెక్టార్లలో తుమ్ముకుంట ఓపెన్ సాండ్ రీచ్ కు, పరిగి మండలంలోని పరిగి గ్రామం వద్ద సర్వేనెంబర్ 566 లో 2.6 హెక్టార్లలో పరిగి ఓపెన్ సాండ్ రీచ్ కు, పరిగి మండలం కొడిగెనహళ్లి గ్రామం వద్ద సర్వేనెంబర్ 2లో 3.9 హెక్టార్లలో కొడిగెనహళ్లి ఓపెన్ సాండ్ రీచ్ కు జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం అనుమతులు జారీ చేసింది. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ కేవీఆర్కే ప్రసాద్, మైన్స్ డిప్యూటీ డైరెక్టర్ పాపారావు, జిల్లా పంచాయతీ అధికారి విజయకుమార్, ఏపీపీసీబీ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శంకర్రావు, ఐబి డివిజన్ ఈఈ ప్రతాప్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రషీద్ ఖాన్, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి రాజశేఖర్ రెడ్డి, హిందుపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, జేపీ కంపెనీ జిల్లా ఇన్చార్జ్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin