సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం లోని దుగ్గొండి మండలంలోని రేబల్లె గ్రామపంచాయతీలో యువ పరివర్త న్ ముంబై వారి సహకారంతో రేబల్లే.గ్రామంలోని మహిళలకు జీవనోపాధి కొరకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా శుక్రవారం నాడు ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుగ్గొండి మండలం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గూడెపు అమరేందర్ హాజరైనారు. ఈ కార్యక్రమానికి యువ పరివర్తన ఎల్ టి సి రొట్టె సురేష్ మోబలైజర్ అడ్డ సతీష్ కుట్టు మిషన్ ట్రైనర్ జి ప్రియాంక వివో ప్రెసిడెంట్ స్వరూప ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి నల్ల బాబురావు ఎమ్మార్పీఎస్ వైస్ ప్రెసిడెంట్ ఎం శివ ఎంఆర్పిఎస్ దుగ్గొండి ప్రధాన కార్యదర్శి కే కిరణ్, ఎల్ టిసి సురేష్ మాట్లాడుతూ మహిళలకు 45 రోజులపాటు కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుంది.అనంతరం దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఇస్తాo కొత్తగా కుట్టు మిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొనుటకు లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గూడెపు అమరేందర్ మాట్లాడుతూ మహిళలకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకు అవసరమైన ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి 15 మంది మహిళలు హాజరు కావడం జరిగినది హాజరైన మహిళలకు కుట్టు మిషన్ కు సంబంధించిన సామాగ్రిని అందజేయడం జరిగినది....
-----------------------
Admin