సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రక్షాబంధన్ రాఖీ పండుగను పురస్కరించుకుని సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జి.వినిత్ కు ఎస్పీ కార్యలయంలో రాఖీ కట్టారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని వేళల్లో మహిళాలకు అందుబాటులో ఉండి, మహిళలకు రక్షణ కల్పిస్తు, తోబుట్టువుల్లాగా మహిళాలను కాపాడుకుంటున్నరని సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ బోర్ర జయమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జోగు కళ్యాణి, జిల్లా కోఆర్డినేటర్ బోర్ర జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సరిత, కొత్తగూడెం పట్టణ కమిటీ సభ్యులు రమాదేవి పాసి, హైందవి, స్వప్న, సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యలయ కోఆర్డినేటర్ చింతల స్పందన తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin