సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సి.ఐ లతో అనంతపురం రేంజ్ డి.ఐ.జి ఎం.రవిప్రకాష్ IPS ఈరోజు రేంజ్ కార్యాలయం నుండీ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండు జిల్లాల్లోని గ్రేవ్ & నాన్ గ్రేవ్ యు.ఐ కేసులు, ఎస్ ఎల్ ఎల్ ( స్పెషల్ లోకల్ లాస్ ) కేసులను సబ్ డివిజన్ వారీగా పురోగతిపై సమీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు ఆరంభంలో యు.ఐ కేసులు13,186 ఉండగా ప్రస్తుతం 12,598 గా ఉన్నాయి. కొద్ది వరకు మాత్రమే తగ్గించారు కానీ అనుకున్న స్థాయిలో పురోగతి సాధించ లేక పోయారని సి.ఐ లు, డీఎస్పీలకు అక్షింతలు వేశారు. యు.ఐ కేసులు బాగా తగ్గించాలి. ఈ ఏడాది ఆఖరుకల్లా కనీసం 4 వేలు యు.ఐ కేసులు తగ్గించాలి. శ్రీసత్యసాయి జిల్లాలో పని చేస్తున్న సి.ఐ లు బాగా కష్టించి యు.ఐ కేసులు తగ్గించాలి. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ప్రాపర్ గా పర్యవేక్షించాలి. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున ఉన్న13588 యు.ఐ కేసులను 6712 కు తగ్గించారు. ఇదే పురోగతి మున్ముందు సాధించాలి. రెండు జిల్లాలోని "కోర్టు మానిటరింగ్ సిస్టం" పని తీరు, విధి విధానాలపై ఆరా తీశారు. ఈ విభాగంలో పని చేస్తున్న పోలీసు అధికారుల/సిబ్బంది ఇటు కోర్టులకు... అటు పోలీసు అధికారులకు వారధిగా నిర్వహిస్తున్న పని తీరును మరియు CCTNS అప్ లోడింగ్స్ లను సమీక్షించారు. పాత ఐ.డి అఫెండర్స్ కు ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పన కింద మంజూరు చేసిన నిధులు, ఆ పథకం ఉద్ధేశ్యం ప్రయోజనకరంగా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ఆర్థిక లబ్ధి పొందాక పాత పంథా వైపు వెళ్లకుండా పర్యవేక్షించాలి. ఎస్సైలు, సి.ఐ లు, డీఎస్పీలకు ఏ విధంగా పి.టి కేసులు అప్పగించారో సమీక్ష చేశారు. ఆసందర్భంగా ఎటువంటి చర్యలు/ జాగ్రత్తలు/ మెళకువలు చేపట్టారో అడిగి తెలుసుకున్నారు. రెండు జిల్లాల్లోని ఫోక్సో కేసుల పురోగతిపై ఆరా తీశారు. ఫోక్సో కేసులు ఏ దశలో ఉన్నాయో, ఈ కేసుల్లో పురోగతి సాధించడానికి అవసరమైన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. అనంతపురం, శ్రీసత్య సాయి జిల్లాల్లోని రెడ్ విలేజ్ ల నుండీ గ్రీన్ విలేజ్ లుగా మారిన గ్రామాల్లోని పరిస్థితులను సమీక్షించారు. శ్రీసత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం శుభ పరిణామమన్నారు. అయినప్పటికీ రెండు జిల్లాల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రమాదాల కట్టడికి ఇన్నోవేటివ్ చర్యలు తీసుకోండి. ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లు తగ్గించండి. అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ IPS మరియు ఇతర పోలీసు అధికారులు ఆయా పోలీసు కార్యాలయాల నుండీ పాల్గొన్నారు....
-----------------------
Admin