సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :కేసిఆర్ పాలన రజాకార్ల రాక్షసత్వాన్ని గుర్తు చేస్తున్నదని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సి. ప్రతాప్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పాలనలలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతుందని బిఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నిజాం నియంత పాలనలా ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్ధి వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కేశంపేట్ మండలం బైర్ ఖాన్ పల్లి, మంగళి గూడ, కొనియా పల్లి, సంతాపూర్, పాటిగడ్డ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్, జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇండ్లు, నీటి ప్రాజెక్టులు. ప్రజలారా ఆలోచించండి. బైర్ ఖాన్ పల్లి, గ్రామంలో నిరుపేద, అర్హులకు ఒక్కరికైన దళిత బంధు, బీసీ బంధు, గృహాలక్ష్మి వచ్చిందా. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజలకు అందిస్తాం. ప్రజల సొమ్మును దోచుకున్న టి ఆర్ ఎస్ నాయకులు మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసి పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్ నగర్ జడ్పీటీసీ వెంకట్ రాం రెడ్డి, యాదయ్య యాదవ్, వీరేశం, జగదీశ్వర్, సురేష్ రెడ్డి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin