సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్లచెరువు మండలంలో చర్చిలో బర్నబాస్ సజ్జా మాధవరపు రామకృష్ణ ఆధ్వర్యంలో పాస్టర్లు నిర్వహించిన సదస్సులు మరియు ప్రత్యేక ప్రార్థనలు లో ముఖ్యఅతిథిగా ఓజో ఫౌండేషన్ అధినేత హుజూర్ నగర్ నియోజకవర్గం కి కాబోయే ఎమ్మెల్యే పిల్లుట్ల రఘు పాల్గొని క్రైస్తవ కిస్ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి పిల్లుట్ల రఘు చేతుల మీదుగా సిల్డ్ అందజేశారు. అదేవిధంగా బహుమతి ప్రధానం మొదటి బహుమతి 10000 రెండో బహుమతి 5000 ఇలా మొత్తం 13 బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవం చాలా గొప్ప మతము అని సర్వమత సమ్మేళనంగా ఉండాలని అన్ని మతాలను గౌరవిస్తూ కలిసిమెలిసి ఉండి భిన్నత్వంలో ఏకత్వం చూపాలని ఈ సందర్భంగా తెలియజేశారు తాను చిన్నతనం నాటి నుంచి క్రైస్తవ సోదరులతో ఉన్న సత్సంబంధాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తానని ఇప్పటి వరకు మెల్ల చెరువు లో అనేక కార్య క్రమాలు చేశా నని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఫౌండేషన్ ఇన్చార్జి , ఫౌండేషన్ సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin