సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచు పల్లి : మండల పరిధిలోని విద్యానగర్ పంచాయితీలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి,అక్రమ పద్దతిలో ఇంటి నెంబర్ పొంది నిర్మాణాలు చేపడుతున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యానగర్ కాలనీ పంచాయితీలో షుమారు పది కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రంగాకిరణ్ కబ్జా చేసి అతని భార్య పేరున అక్రమ పద్దతిలో ఇంటి నెంబర్:3-1-235/1జీ పొందడమే కాకుండా సదరు స్థలంలో పంచాయితీ రాజ్ చట్టాలకు, ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేడుతున్నారని ఆరోపించారు. అతనికి ఉన్న రాజకీయ పలుకుబడితో కేంద్రమంత్రుల నుండి, ఎంపీల వరకు పైరవీలు చేస్తూ అధికారులను ప్రలోబాలకు గురి చేస్తూ యదేచ్చగా నిర్మాణాలు జరుగుతున్నా నెల రోజులుగా పంచాయతీ కార్యదర్శి మొదలు జిల్లా కలెక్టర్ వరకు పిర్యాదులు చేసినా నేటికీ స్పందించడం లేదని అన్నారు. ప్రధాన జాతీయ రహదారిపై బహుళ అంతస్థుల నిర్మాణాలు జరుగుతున్న అదికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ధనుంజయ్, జంగం జశ్వంత్, బాబులాల్, శంకర్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin