సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టీఎన్జీవో యూనియన్ కు సమీకృత కలెక్టరేట్ కార్యాలయoలో,మరియు తాలూకా యూనిట్లలో భూములు కేటాయించి బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ని కోరిన జిల్లా మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్. టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్, టీఎన్జీవోస్ యూనియన్ ఉద్యోగుల సౌకర్యార్థం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం లో,తాలూకా యూనిట్ల లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు సమిష్టిగా సన్నాహక సమావేశాలు,సమస్యలపై చర్చించుకునేందుకు ప్రత్యేకంగా స్థలం కేటాయించి బిల్డింగ్ నిర్మాణాలకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని జిల్లా మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. అట్టి విజ్ఞప్తి మేరకు జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ స్పందించి జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కి స్థలం కేటాయింపుపై ఆదేశాలు జారీ చేశారు.ఉద్యోగులకు సమీకృత కలెక్టరేట్, తాలూకా యూనిట్లలో స్థలం కేటాయింపుపై జిల్లా మంత్రి స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు...
-----------------------
Admin