సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల సారపాక లో సారపాక గ్రామ పంచాయతీ వారు పినపాక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి ఆధ్వర్యంలో.. పంచాయతీ కార్యదర్శి మహేష్ మరియు సిబ్బంది పాల్గొని ఇరవెండి రోడ్ లో గల వాటర్ ట్యాంకుల వద్ద నుండి సారపాక గ్రామపంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి కార్యక్రమం విజయవంతం చేసి ప్రజల మంచినీటి కష్టాలను తీర్చారని, గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని తెలంగాణ రాష్ట్రంలో మంచినీటి కష్టాలు లేకుండా చేశారని, కెసిఆర్ అడుగుజాడల్లో పినపాక శాసనసభ్యులు యువ నాయకులు రేగా కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin