Sunday, 26 July 2026 02:53:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బంగారం కోసం మహిళను హత్య... హత్య చేసిన నిందితుడి రిమాండ్...

Date : 14 July 2023 05:44 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఒంటరి మహిళలు అతని టార్గెట్.... కలుకంపౌండ్లు మద్యం దుకాణాల వద్ద ఉన్న ఒంటరి మహిళలకు మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న నగలను దోచుకోవడమే అతని వృత్తి.. ఎవరైనా మహిళలు ప్రతిఘటిస్తే వారిని చంపడానికి కూడా వెనకాడని నైజాం అతనిది. ఈ నేపథ్యంలోనే ఒంటరి మహిళను టార్గెట్ చేసి హత్య గావించి నగలను దోచుకున్న వ్యక్తిని షాద్ నగర్ పోలీసులు అరెస్టు రిమాండ్ కు తరలించారు. గురువారం షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి వెల్లడించిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని బంగారం పల్లి గ్రామానికి చెందిన దారముని గంగమ్మ (40) షాద్ నగర్ పట్టణంలోని ప్రశాంత్ నగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో నివసిస్తుంది. కాగా ఈనెల 8వ తేదీన ఉదయం ఇంట్లో నుండి బయటకు వెళ్లిన గంగమ్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెంకటయ్య బంధువుల ఇంటికి వెళ్లిందని అనుకొని ఆరా తీశాడు. గంగమ్మ ఆచూకీ ఎక్కడ దొరకపోవడంతో ఈనెల 11న షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు పట్టణంలోని హైటెక్ సిటీ కాలనీ పరిసరాలో ఉన్న ముళ్ళ పొదల్లో మహిళా శవాన్ని గుర్తించారు. మృతి చెందింది తన భార్య గంగమ్మనేనని వెంకటయ్య నిర్ధారణ చేయడంతో పోలీసులు ఆ కోవలో దర్యాప్తు చేపట్టారు. పట్టణంలోని సిసి కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు గంగమ్మ ది హత్యగా భావించారు. కల్లు దుకాణం వద్ద ఉన్న గంగమ్మకు మాయమాటలు చెప్పిన మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం మెట్టుగడ్డ తండా కు చెందిన జర్పుల హీర్యా హాజిపల్లి రోడ్డు లోని హైటెక్ సిటీ కాలనీ పరిసరాల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరు కలిసి మద్యం సేవించిన తర్వాత గంగమ్మ ఒంటిపై ఉన్న నగలను దోచుకునే ప్రయత్నం చేశాడు. ఇందుకు గంగమ్మ ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న బండరాయితో గంగమ్మ తలపై మోదాడు. గంగమ్మ చనిపోయిందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమె కాళ్లకు ఉన్న 48 తులాల కడియాలను తీసే ప్రయత్నం చేశాడు. అవి ఎంతకు రాకపోవడంతో ముందుగానే వెంట తెచ్చుకున్న యాక్సిస్ బ్లేడ్ తో ఆమె కాలి మేడిమలను కోసి కడియాలను దొంగిలించాడు. ఇదే కోవలో ఈనెల 11న పట్టణంలోని కూలీల అడ్డా వద్ద ఒంటరిగా ఉన్న మహిళ వద్ద నగలను దోచుకునేందుకు ఆమెకు మాయమాటలు చెప్పి ఎలికట్ట గ్రామం దగ్గర ఉన్న వెంచర్ లోనికి తీసుకెళ్లాడు. ఆమెను గాయపరిచి ఆమె వద్ద ఉన్న ముక్కుపుడకలను, సెల్ ఫోన్ తో పాటుగా 2000 రూపాయలు నగదు తీసుకొని పారిపోయాడు. సిసి పుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్న పోలీసులు గురువారం అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిధితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సిఐ ప్రతాప్ లింగం, సిసిఎస్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ వీరా బాబు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సిసిఎస్ ఎస్సై జాకీర్, ఏ ఎస్ ఐ సత్యనారాయణ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, సిబ్బంది మోహన్, యాదగిరి, జాకీర్, రవి, రఫీ కేసును చేదించడంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ లు కీలకపాత్ర పోషించారని వారికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందనీ శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తెలిపారు. అనతి కాలంలోనే కేసును చేదించి నిందితుడిని పట్టుకోవడం పట్ల డిసిపి స్థానిక పోలీసు అధికారులను అభినందించారు. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మాయమాటలు నమ్మి వెంట వెళ్లకూడదని, పట్టణ ప్రజల కూడా అనుమానాస్పద వ్యక్తుల పట్ల దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: