Monday, 27 July 2026 04:11:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అదానీ గ్రూప్ లపై మరింత విచారణ జరిపించాలి...

Date : 07 February 2023 02:29 AM Views : 698

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : అధాని గ్రూప్ ల పై నిష్పక్షపాత విచారణ జరిపించి సామాన్య మద్దతు తరగతి పేదల సొమ్మును విడిపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం టిపిసిసి,సి యల్ పి పిలుపుమేరకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు,ఖమ్ం నియోజకవర్గ పి సి సి సభ్యులు మహమ్మద్ జావేద్,పాలేరు నియోజకవర్గ పి సి సి సభ్యులు రాయల నాగేశ్వరరావులతో కలిసి సోమవారం సిటి సెంట్రల్ ఫంక్షన్ హాల్ దగ్గర నుండి రోటరీ నగర్ ఎస్బిఐ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... కోట్లాదిమంది భారతీయుల కష్టార్జిత పొదుపును ప్రమాదంలో పడేస్తూ మార్కెట్ విలువను కోల్పోతున్న కంపెనీల్లో ఎల్ఐసి, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక సంస్థలు పెట్టుబడులు పెట్టే అంశంపై పార్లమెంట్లో చర్చను ప్రారబించాలని అన్నారు. ఎల్ఐసి, ఎస్బిఐ లు మన దేశానికి గర్వకారణమని కోట్లాది మంది భారతీయులు కష్టపడి సంపాదించిన డబ్బుతో అవి నిర్మించబడ్డాయని అన్నారు.నేడు మోడీ తన ప్రాణ స్నేహితునికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం అధాని గ్రూప్ లో ఎల్ఐసీ ,ఎస్బిఐ మరియు ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులను బలవంతంగా పెట్టుబడులు పెట్టేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.భారతీయ బ్యాంకులకు అధాని గ్రూప్ సుమారు 80వేల కోట్ల రూపాయలు బకాయి పడిందని అన్నారు. అదంతా సామాన్య ప్రజల కష్టార్జితమని అన్నారు. నల్లధనం వెనక్కి తెచ్చి పేదలకు పంచుత అన్నా మోడీ పేదల సొమ్మును తన స్నేహితులకు ధారదత్తం చేస్తున్నాడని ఆరోపించారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై పార్లమెంట్ లో చర్చ నిర్వహించాలని, ఏల్ ఐసీ, ఎస్బిఐ లో పెట్టుబడి పెట్టిన సామాన్య మధ్య తరగతి పేదలకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను దుర్వినియోగం అవుతున్నాయని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకొని దేశాన్ని ప్రమాద స్థాయి నుండి కాపాడాలని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ఖమ్మం నగర పి సి సి సభ్యులు,జిల్లా ఓ బి సి సెల్ అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం,వైరా నియోజకవర్గ పి సి సి సభ్యులు వడ్డే నారాయణరావు,మాళోత్ రాందాస్ నాయక్,జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు దొబ్ల సౌజన్య,జిల్లా యస్ సి సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య,నగర కాంగ్రెస్ కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు,పల్లెబోయిన భారతి చంద్రం,లకావత్ సైదులు నాయక్,కామేపల్లి జిల్లా పరిషత్ సభ్యులు భాణత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, జిల్లా ఓ బి సి సెల్ ఉపాద్యక్షులు గజ్జెల్లి వెంకన్న,మండల కాంగ్రెస్ అద్యక్షులు కళ్ళెం వెంకటరెడ్డి,గింజల నర్సిరెడ్డి,అంబటి వెంకటేశ్వరరావు,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కన్నెబోయిన గోపి యాదవ్,జిల్లా కాంగ్రెస్ నాయకులు బోజడ్ల సతీష్,మూడుముంతల గంగరాజు యాదవ్,మద్ది వీరారెడ్డి,నగర బి సి సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్,నగర మైనారిటి సెల్ ఛైర్మన్ అబ్బాస్,నగర సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెనిగండ్ల సత్యనారాయణ,బోజెడ్ల సత్యనారాయణ, ఏలూరి రవి కుమార్, నూకారపు వెంకటేశ్వర్లు,జహీర్,రజి నాయకులు శంకర్ నాయక్,వసీం, మారం కరుణాకర్ రెడ్డి,అజ్గర్,కొప్పుల గోవిందరావు,రామిరెడ్డి,గడ్డం వెంకటయ్య,బీరెడ్డి రమేష్, కిలారి అనిల్ కుమార్,దొడ్డా ప్రవీణ్,బాబా,గాదర్ బాబు,కొట్టె ప్రసాద్,బండి నాగేశ్వరరావు,ఇబ్రహీం,రజని,బత్తుల గీత,పుష్ప,దివ్య,విజయలక్ష్మి,లాల్ బి,ముజాహిద్దీన్ తదితర నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :