Monday, 27 July 2026 05:28:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం...

Date : 01 June 2023 10:36 AM Views : 426

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : కొణిజర్ల / ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది.దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఖమ్మం దవాఖానకు తరలించారు. ఎదురుగా వెళ్తున్న లారీ బ్రేకు వేయడంతో కారు ఢీకొన్నదని, దీంతో కారు వెనక వస్తున్న మరో లారీ దానిని గుద్దిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.కొణిజర్ల నుంచి వైరా వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతులను వైరా మండలం విప్పలమడక గ్రామానికి చెందిన పారుపల్లి రాజేష్, సుజాత దంపతులు, కుమారుడు అశ్విత్ (13)గా గుర్తించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :