సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గుండెపోటుతో మరణించిన శ్రీ నందమూరి తారకరత్నకు బూర్గంపాడు మండల తెలుగుదేశం పార్టీ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర TNTUC ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు గారు మాట్లాడుతూ తారకరత్న లేని లోటు అటు సినీ రంగానికి ఇటు తెలుగుదేశం పార్టీకి ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ITC TNTUC అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్ గారు మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబం ఒక సభ్యుని కోల్పోయిందని ఇది పార్టీకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల తెలుగుదేశం నాయకులు తాళ్లూరి జగదీశ్వరరావు, కాకర్ల సత్యనారాయణ, గల్లా నాగభూషయ్య, ఆకుల పద్మ రాయనీ రాము ,అంతటి గురవయ్య తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin