Sunday, 26 July 2026 11:25:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి...

Date : 18 January 2023 01:00 AM Views : 618

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బీసీ కులగణన చేపట్టి,బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.మంగళవారం పార్టీ శ్రేణులతో కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపి కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా 50 శాతానికి పైగా ఉంటే విద్య,ఉద్యోగ తదితర రంగాల్లో బీసీలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతుండటం శోచనీయమన్నారు దేశంలో 1931 నాటి జనాభా లెక్కల ప్రకారం 50 శాతం పైగా ఉన్న బీసీల అభివృద్ధికి ప్రభుత్వాల వద్ద నేటికి సమగ్ర కార్యాచరణ లేదని విమర్శించారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా బీసీల లెక్కలు చేయకపోవడం దారుణమన్నారు.2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో బిజెపి అధికారంలోకి వస్తే 100 రోజుల్లో బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చి 8 ఏళ్ళు గడిచిన కులగణన చేపట్టకపోవడం బట్టి బీసీల పట్ల పాలకులకి ఎంత చిత్తశుద్ధి ఉందొ అర్ధం అవుతుందన్నారు.బీసీ కులగణన చేపట్టి బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సాయి,అసెంబ్లీ మహిళా కన్వీనర్ కోలా మల్లికా,పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,కేతిని కుమారి,నాగుల రవికుమార్,చెనిగారపు నిరంజన్ కుమార్,గుడివాడ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :