Sunday, 26 July 2026 09:51:45 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు నామినేషన్ జన సముద్రమైన హుజూర్ నగర్...

Date : 11 November 2023 10:38 AM Views : 494

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గం లో సింహం గుర్తుతో ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ చరిత్ర సృష్టిస్తా పిల్లుట్ల రఘు అంటే నమ్మకం, కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు అంటే అమ్మకం నియోజకవర్గం లో టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటమే శిక్ష ఇది రాజకీయ పార్టీలకు,, ప్రజా సేవ చేసే మంచితనానికి మధ్య పోటీ ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా మట్టపల్లి లక్ష్మీ నరసింహ దేవస్థానం, మేళ్లచెరువు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అందరూ దేవుళ్ళ దీవెనలతో ప్రజల ఆదరణతో తాను ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని అన్నారు. తనలా సేవలు చేసే నాయకుడు నియోజకవర్గనికి రావటమే అదృష్టమని ప్రజలు ఆలోచించి సింహం గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే గెలుపుకు భాగస్వాములు కావాలని కోరారుహుజూర్ నగర్ పట్టణం ఏఐఎఫ్ బి పార్టీ తరఫున సింహం గుర్తు తరపున నామినేషన్ సందర్భంగా డోలు డప్పులతో, వాయిద్యాలతో, కంజర్లతో, కళాకారులు, పోతురాజు సింహం వేషాలతో,,కార్లు,ఆటోలు, బైక్ ర్యాలీతో స్వచ్ఛందంగా వచ్చిన జనసంద్రంతో రోడ్లన్నీ కాబోయే ఎమ్మెల్యే పిల్లుట్ల రఘు అనే నినాదంతో నియోజవర్గం దద్దరిల్లిపోయింది.. గత మూడు సంవత్సరాల కాలాల నుంచి నిన్న సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందిన పిల్లుట్ల రఘుకు గ్రామాల పట్టణాల నుంచి ప్రజలు, పెద్దలు, యవతి యువకులు, తండాల ప్రజలు, ఎస్ సి,ఓ సి జనహాని, బహుజన వాదులు, బీసీ కమ్యూనిటీ ప్రజలు తండోప తండాలుగా ఆశీర్వదించడానికి వచ్చారు..ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు దొంగ ముఠాలు తయారైనయని వారు దోచుకోవడం దాచుకోవడం తప్ప సామాన్య ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నాయకులు తామే సొంతంగా ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ పార్టీల పాలనలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ప్రజల బాధలను, సమస్యలను చూడలేక తాను రాజకీయ రంగ ప్రవేశం చేశానని పిల్లుట్ల రఘు అన్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కనబడితే కబ్జాలు, రౌడీయిజం గుండాయిజం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు దీంతో టిఆర్ఎస్ పార్టీ మీద పూర్తిగా నమ్మకం పోయిందని ప్రజలంటున్నారన్నారు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాకు పిల్లలు లేరు ప్రజలే నాకు పిల్లలు అంటాడు.. కానీ ఎంపీ తనది ఎమ్మెల్యే తనదే, కోదాడ కూడా తనదే అని అంటున్నాడనిపదవుల కోసం ప్రాకులాట అన్నట్లు అతని యవ్వారంల ఉందని అన్నారు.ఉత్తంకుమార్ రెడ్డి పద్మావతి అధికార దాహం కలవారు 2018 ఎన్నికల్లో ఉత్త కుమార్ రెడ్డి పద్మావతి నాలుగు సార్లు ఎన్నికలు పోటీ చేసి కోదాడ నుండి 500 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇక్కడ ఉత్తంకుమార్ రెడ్డి ఒక ట్రాక్టర్ టక్కు గుర్తుతో చావు నోట్లో తలపెట్టి బయటకు వచ్చినట్టు గెలిచారు. కానీ కోదాడ నియోజకవర్గం పద్మావతికి ఎటువంటి పని లేనట్టు,హుజూర్నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కి సంబంధం లేనట్టు రాజీనామా చేసి ఆయనేమో ఎంపీగా పోటీ చేసి భార్యని ఇక్కడ పోటీ చేపించాడు ఇందులో ఎంత స్వార్థం కనిపిస్తుంది. ఇక్కడ ఎంత అధికార దాహం కనిపిస్తుంది ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని ఉత్తమ మద్దతు ఇచ్చే నాయకులు ఒకసారి ఆలోచన చేయాలి అన్నారు. నియోజకవర్గం లో ప్రజలను అన్ని విధాలు ఆదుకుంటూ విద్య,వైద్యం,ఆర్థికంగా ఆదుకుంటూ, నిరుద్యోగులకు కోచింగ్ ఉచిత భోజన సదుపాయం కల్పిస్తూ వెన్ను తట్టి ఉంటూఅనేక పాఠశాలలు,దేవాలయాలు నిర్మాణాలకు తోడ్పడుతూ, బొడ్రాయి, విగ్రహప్రతిష్ట లకు, అన్నదానాలకు ఆర్థిక సహాయం అందిస్తూ, కులాలకు మతాలకు అతీతంగా కుల మతాలు భేదాలు లేకుండా పండగలు అన్నింటికీ అన్నదానాలు నిర్వహిస్తూ ప్రజలందరూ సమానమే బావని తీసుకొచ్చిన ఘనత తనదే అన్నారు. ప్రజల కోసం మనకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిగా అన్ని కులాల మతాల మద్దతు తనకే ఉందనిఅన్నారు పార్టీలలో లేకపోయినా స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పాలనను చేసి చూపెడతానని అన్నారుస్వార్ధపరులు అవినీతి నాయకులు పార్టీలలో ఉన్నారని, పార్టీల్లో ఉన్న నాయకులకే ప్రభుత్వపథకాలు అందుతున్నాయని, సింహం గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిస్తే సమన్వయ పాలన ప్రజలకు అందిస్తానని అన్నారుఎస్సీ, ఎస్టీబిసి,ఓసి ముస్లిం క్రిస్టియనమైనార్టీలు బహుజనుల ప్రజలందరూ ఒకసారి ఆలోచించి మార్పు కోరుకొని ప్రతి ఒక్కరూ సింహం గుర్తు పై ఓటేసి ప్రజల పక్షాన నిలబడే తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని పిల్లుట్ల రఘు అన్నారు.గడపగడపకు భరోసా యాత్రతో ప్రజల సమస్యలు ఊరు ఊరురా గల్లి గల్లి లో సమస్యలు తెలుసుకొని అధికారంలోకి రాగానే తీరుస్తానన్నారు పార్టీలుగా దీటుగా తనకూడ మేనిఫెస్టో ఉంచామని 24 గంటల టోల్ ఫ్రీ సౌకర్యంతో ప్రజా సమస్యల విని పేదలకు ఇండ్లువిద్య,వైద్యంఆర్థికంగా నిరుద్యోగం , పండగ కార్యక్రమాలు, పెళ్లి కానుకలు, దశదినకర్మలకు చేయూత, దేవాలయ పాఠశాల నిర్మాణాలు, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్,ప్రీజర్ బాక్సులు ఎమ్మెల్యే గెలిచి అధికారంలోకి రాగానే ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా నిర్వహిస్తామని సింహం గుర్తు ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లుట్ల రఘు అన్నారు తదుపరి నామినేషన్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కి ఇచ్చి ప్రక్రియ పూర్తి చేశారు.. ఈ నామినేషన్ కార్యక్రమంలో మండలాలు ఇన్చార్జులు గ్రామాల ఇన్చార్జీలు, ఎఐఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు ప్రజలు మహిళలు నాయకులు రఘున్న అభిమానులు ఓజో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :