Monday, 27 July 2026 07:31:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలు. హాజరైన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ హరీష్.

Date : 14 June 2023 06:21 AM Views : 483

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ లో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలు జరుపుకున్నారు. మహిళా ఆకాశంలో సగం కాదు, ఆమే ఆకాశం అని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఈడేన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా సంక్షేమ దినోత్సవం వేడుకలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ ముఖ్య అతిగా హాజరయ్యారు. ఐసీడిఎస్ శాఖ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే, కలెక్టర్ మాట్లాడుతూ.... సమాజంలో సగభాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి జరుగుతుందని. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అనేక మహిళ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోందని అన్నారు. మహిళల కోసం, చిన్నారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపేట్టడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ప్రశంస పత్రాలు అందజేసి, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ఖాజా ఇద్రిస్, జెడ్పిటిసిలు వెంకట్రామిరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్, జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, ఐసీడిఎస్, సిడిపివో నాగమణి, డిఎమ్ ఎచ్ఓ జయలక్ష్మి,సూపర్ వైజర్లు పద్మావతి, జ్యోతి, విజయలక్ష్మి, షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, చైర్మన్ కొందుటి నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, నారాయణరెడ్డి, ఎంపీడీవో వినయ్ కుమార్, కొత్తూరు, నందిగామ, కొందుర్గు జెడ్పిటిసిలు, ఎంపిపిలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: