సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వరంగల్- ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల శాసనమండలికి జరుగనున్న ఎన్నికలకు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కు నమోదుకు నవంబర్ 2020 వరకు డిగ్రీ లేదా ఏదేని తత్సమాన విద్యార్హతలలో పట్టభద్రులైన వారు అర్హులని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 22,510 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఓటుహక్క నమోదుకు ఫారం 18 ద్వారా అన్ని తహసీల్దార్ కార్యాలయాలతో పాటు కొత్తగూడెం, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందచేయాలని చెప్పారు. https://ceotserms2.telangana.in/MLC/form18.aspx వెబ్సైట్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఓటు హక్కు నమోదుకు ఫిబ్రవరి 6, 2024 వరకు మాత్రమే అవకాశం ఉందని, ఇంకనూ నమోదు కానీ వారు తక్షణమే నమోదు కావాలని చెప్పారు. మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నదని పట్ట భద్రుల ఓటు నమోదు చేసుకోవాలని చెప్పారు. ఫిబ్రవరి 24 న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తామని, ఓటరు ముసాయిదా జాభితా పరిశీలన చేసుకుని అభ్యంతరాలు తెలియచేయడానికి ఫిబ్రవరి 24వ తేది నుండి మార్చి 14వ తేది వరకు స్వీకరించి వచ్చిన అభ్యంతారాలు పరిష్కారం తదుపరి తుది ఓటరు జాభితా 04.04.2024 ప్రకటిస్తామని చెప్పారు. నవంబర్ 2020 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు శాసనమండలి పట్ట భద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు నమోదుకు అర్హులని చెప్పారు. ఓటరు నమోదుకు దరఖాస్తు చేయు అభ్యర్థులు జిరాక్స్ పత్రాలపై డిజిగ్నేటెడ్ అధికారి లేదా గెజిటెడ్ అధికారులచే అటెస్టేషన్ చేపించాలని చెప్పారు. నమోదు ఫారంతో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు, ఆధార్, డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులు జత చేయాలని చెప్పారు. గతంలో ఓటు హక్కు ఉన్న పట్టబద్రులు తిరిగి ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేయాలని చెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో విచారణకు వచ్చే బూతు స్థాయి అధికారులకు ఒరిజనల్స్ చూపించాలని తెలిపారు.
-----------------------
Admin