సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గాజుల రామ్ బస్తి ప్రభుత్వ పాఠశాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం... జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం గాజుల రాజం బస్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇంకా సందర్భంగా 25వ వార్డు కౌన్సిలర్ సహేరా వేగం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును బ్రహ్మాస్త్రంలా వినియోగించుకోవాలనీ ఈ సందర్భంగా ఓటు తరతరాల గతిని మార్చిన అస్త్రం. బ్రష్టు పట్టిన వ్యవస్థకు చెరమగీతం పాడే వజ్రాయుధం అని అన్నారు. అనంతరం చిన్నారులతో ముగ్గుల పోటీ నిర్వహించి వారికి పెన్నులు, పెన్సిల్స్, బాక్సులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సహేరా బేగం mro ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సిరాజ్, స్కూల్ హెడ్మాస్టర్, అంగన్వాడి టీచర్లు, మట్ట రాజకుమారి, శ్రీదేవి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin