సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధుల, వివిధ రాజకీయ పార్టీల నాయకుల మరియు వివిధ శాఖల అధికారుల మధ్యన ఎంపీపీ గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంపీపీ పార్వతి కొండా నాయక్ ని, తోటి ఎంపీటీసీ లను ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీలు, సీనియర్ నాయకులు వారు చేసిన అభివృద్ధిని, గుర్తు చేసుకున్నారు. ఎంపీపీ మూడవత్ పార్వతి కొండ నాయక్ మఠంపల్లి మండల ప్రజాపరిషత్ విధులను సక్రమంగా నిర్వహించి అభివృద్ధికి తోడ్పడ్డారని కొనియాడారు. పార్వతి కొండా నాయక్ దంపతుల ఇరువురికి మండల ప్రజా ప్రతినిధులుగా సేవలు అందించడం అదృష్టమని, అందరికీ ఈ అవకాశం రాదని కొందరికే వస్తుందని తెలిపారు. ఎంపీపీ లుగా పార్వతి, కొండా నాయకులు పనిచేసిన కాలాలలో అవినీతికి ఆస్కారం లేకుండా మంచి పాలన అందించారని రాజకీయ నాయకులు అధికారులు తెలిపారు.,ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఎంపీపీ పదవి ఐదు సంవత్సరాలు ప్రజలకు చేరువగా ప్రతి ఒక్కరికి సేవలందించిన్ననాని, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాన్ని పేద , బడుగు బలహీన వర్గాలకు చేరవేశానని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని, తెలియజేశారు. రాజకీయ జీవితంలో పదవులు వస్తుంటాయి పోతుంటాయి పదవులు శాశ్వతం కాదని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలకు ప్రజాసేవ చేయటం కోసమే రాజకీయాల్లో వచ్చామని, మునుముందు ప్రజా సేవలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తామనీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మా తోటి ఎంపీటీసీలు మాకు సాహయసహకారాలు అందించి అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఎంపీటీసీ కి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ రాజకీయ జీవితమే ప్రజాసేవకే అంకితం అని ఎంపీపీ పార్వతి కొండ నాయక్ తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ శాఖల అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జర్నలిస్టు లు, వాస్కుల రామయ్య, రవీందర్ నాయక్, చిలక సైదయ్య,పల్లె సుధాకర్, బేత శివారెడ్డి, మాలోత్ శంకర్ శాలువాలతో బొకే లతో, పూల మాలతో, ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు, పార్టీ సీనియర్ నాయకులు,, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు....
-----------------------
Admin