సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువుమండల పరిధిలోని తంగేడు కుంట రైతు భరోసా కేంద్రం నందు స్తోత్రియం కలిగిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకి ప్రభుత్వం అందించే వేరుశనగ కాయలు పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆదేశాలు అనుసారంగా విత్తన పంపిణీ చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు అవుటాల రమణారెడ్డి , పాల్గొని మాట్లాడుతూ వేరుశనగ విత్తనం ఎమ్మెల్యే ప్రోద్బలం తో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకి అంద జేయడం జరిగింది అని వీటిని సరిగ్గా వినియోగించుకోవాలి .అలాగే చిరుధాన్యాలు కూడా సాగు చేసి అధిక దిగుబడులు పొందాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి , వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజు నాయుడు , డి ఆర్ సి ఎఫ్ టి సి ఏ డి ఏ సనాఉల్లా , మండల వ్యవసాయ అధికారి ఇలియాజ్ అహమ్మద్ ,తంగేదుకుంట వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఖాన్ ,తంగేడుకుంట సర్పంచ్ అబిదా బాను ,ఎంపీటీసీ సభ్యులు రమణా , మండల బీసీ అధ్యక్షుడు చింతా వెంకటేష్ ,గ్రామ కన్వీనర్ సనత్ స్వామి , రమేష్ , కృష్ణా రెడ్డి , వెంకటరెడ్డి , శ్రీనివాసులు ,రైతులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin