సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, ఏ సి డి చార్జీలను రద్దు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా కొత్తగూడెం భజన మందిర్ దగ్గర పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ సి డి పేరుతో పేద మధ్యతరగతి వర్గాలపై విధిస్తున్న డిపాజిట్ భారంగా మారింది. పెరిగిన విద్యుత్ బిల్లులు కట్టలేక సతమతమవుతున్న పేద వర్గాలపై మరింత భారం మోపే విధంగా ఏ సి డి చార్జీలను విధించడానికి వ్యతిరేకిస్తున్నాం అని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. అదే విధంగా ప్రభుత్వం హామీ మేరకు వ్యవసాయానికి ఎలాంటి కోతలు లేకుండా త్రీఫేస్ కరెంటు సరఫరా చేయాలని అదేవిధంగా కరెంటు మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే విద్యుత్ మీటర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి, జమలయ్య,జి చింతల, యం యస్. వెంకటేశ్వర్లు, యం డి అబ్బాస్, వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin