Monday, 27 July 2026 04:11:13 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి....

Date : 17 February 2023 12:03 AM Views : 607

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట , పాఠశాలలను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలి. పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి... గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులను తనిఖీ చేయడంతో పాటు ఆయా పాఠశాలల్లో విద్యాప్రమాణాలను పరిశీలించారు. మక్తల్ మండల కేంద్రంలోని ప్రాథమిక జి పి పాఠశాల ,ప్రాథమిక ఉన్నత పాఠశాల చందాపుర్, కర్ని, అనుగొండ, రుద్ర సముద్రం పాఠశాల ను ఆకస్మిక తనిఖీ చేశారు. మన ఊరు మన బడి పనులను పరశీలించి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అక్కడ ఉన్న ప్రధానోపాధ్యాయులకు విద్యార్థులకు నాణ్యమైన భోజనము అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులను విద్య ప్రమాణాలను పెంచి విద్యార్థులకు అన్ని విషయాలలో సమర్త్యాలు వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పాఠశాలకు విద్యార్థులు ప్రతి రోజు వచ్చేటట్లు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులందరూ కచ్చితంగా బోధించే అంశాలపై లెసన్ ప్లాన్ రాయాలని ఆదేశించారు. అదే విధంగా పాటశాల అవరణం లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఉపాధ్యాయులు ప్రతిరోజు స్పెషల్ క్లాసులు తీసుకోవాలని వారానికి ఒక్కసారి వారికి టెస్ట్ లను నిర్వహించాలని, మన ఉరు మన బడి కార్యక్రమం లో భాగంగా చేపట్టవలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలనీ వాటర్ సంపు, విద్యుత్ మరియు ప్రహరి గోడల నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ డీఈ, ఏఈ లాను ఆదేశించారు. గర్బినీలా వివరాలు యాప్ లో రిజిస్ట్రేషన్ చేయాలి, 102 ఒంటరి గర్బిణీలకు పరీక్షలకు తీసుకోవాలన్నారు. వారి కి ప్రసవ అనంతరం కూడా వారిని 102 వాహనం లోనే ఇంటికి తీసుకెళ్లాలన్నారు. మాతా శిశు కార్డులో ప్రతిది నామోదు చేయాలి. గర్భిణీ బాలింతలు బర్త్ ప్లానింగ్ 7 వ నెల సమయం లొనే ఉండాలన్నారు. తప్పని సరిగా సాధారణ ప్రసవాలు చేయాలని ఆదికూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలన్నారు. గైనకాలజిస్ట్ ద్వార వారి ఆరోగ్యం పై యెప్పటికి అప్పుడు తెలుసుకుంటూ ఉండాలన్నారు. పిల్లా హెనిమియా, హుమినైజేషన్ చెక్ చేస్తు ఉండాలన్నారు. హేనిమియ తక్కువ గా ఉన్నవారికి చికిత్స అందించాలన్నారు. నాన్యమైన వైద్యాన్ని అందించినప్పుడే ఆసుపత్రిలో OP లు పెరుగుతాయని ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. ఆశలు, ఏఎన్‌ఎం, సూపర్‌వైజర్‌లు ఫీల్డ్‌లో ఉండలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాంచందర్ నాయక్,జిల్లా విద్యాశాఖ సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, డీఈలు రాము,మంగులాల్ ,ఎం పి డి ఓ శ్రీధర్, MPO పావని, కాంట్రాక్టర్ లు ఏఈ శ్రీకాంత్ , ప్రధానోపాధ్యాయులు, ఎస్ ఎమ్ సి చైర్మన్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :