సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలంలోని వేపల సింగారం గ్రామంలో ఉత్తమ్ కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి హుజూర్ నగర్ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు మరియు ఇతర కార్యకర్తలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇస్తున్నా పాతవారు, కొత్తవారు అందరూ పార్టీలో సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నా హుజూర్ నగర్ నియోజకవర్గంలోనీ ప్రతీ గ్రామంలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. హుజూర్ నగర్ లో 50వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇప్పుడు జరిగే 5రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి ఈ5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే మొదటి మెట్టు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ ప్రధాని కావడం ఖాయం దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి చెల్లించలేదు, ఒక్క ఇల్లు కూడా పేదవానికి కట్టించలేదు ఎమ్మెల్యే సైదిరెడ్డి మాత్రం మూడొందల ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించాడు ముప్పై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఒక్క మచ్చ కూడా లేదు పోలీసులను అడ్డం పెట్టుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.కేటీఆర్, కవిత రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు సరికాదు మీది ఆ స్థాయి కాదు రాజకీయంగా నష్టపోతున్నా అని తెలిసినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఘనత గాంధీ కుటుంబానిది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే మీ ఉత్తమన్న మంచి పదవిలో కొనసాగుతాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం...
-----------------------
Admin