సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం చింతమాను పల్లి తారు రోడ్ & రైతు భరోషా కేంద్రాన్ని శాసనసభ్యులు దుద్దికుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. . ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. అంతేకాదు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వమే పంపిణీ చేస్తుంది. అంతేకాదు కాల్‌సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.. రైతులకు ఆర్ బి కే అధికారులుఅందుబాటులో ఉంటారు. అనంతరం ఓబులదేవర చెరువు మండల రామిరెడ్డిపల్లి గ్రామం తారురోడ్డును శిలాఫలకాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్ది కుంట శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహ మండల చైర్మన్ ఆవుటా ల రమణారెడ్డి, ఎంపీపీ పర్వీన్ భాను సర్పంచ్ జగన్ మోహన్ చౌదరి, సింగిల్ విండో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి ,కన్వీనర్ రాజు నాయుడు ,మండల అగ్రి చైర్మన్ లక్ష్మారెడ్డి, పిఆర్ డిఇ శ్రీనివాసులు , మండల వ్యవసాయ అధికారిఇలియాస్ , వైఎస్ఆర్సిపి, ప్రజాప్రతినిధులు ,నాయకులు పాల్గొన్నారు....
-----------------------
Admin